అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారు అయింది… కొందరు నాయకులు కేసుల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు.. మరికొందరు సొంత వ్యాపారాలు ముందుకు సాగక ఇబ్బంది పడుతున్నారు.. ఇంకొందరు పార్టీలో ఉండి కూడా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు.. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతోందనే గందరగోళం తలెత్తుతోంది… టీడీపీలో ఫైర్ బ్రాండ్ అధికారులను దూషించి వివాదాస్పదంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎట్టకేలకు లొంగిపోయారు…
వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనపై ఉన్న కేసులు వెలుగులోకి వచ్చాయి… ఇక కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు సీఎం జగన్ చిత్తశుద్దితో పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలే అన్నారు… విద్యుత్ చార్జీలు ఎత్తేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలు వృదా అని తెలిపారు… ఎందుకు దీక్షలు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదని ఆయన చెప్పారు…
పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కృషి చేశారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.. ఇక పలువురు కీలక నేతలు ఇటీవలే నిర్వహించిన పార్టీ మహానాడుకు దూరమయ్యారు… అదేవిధంగా సీనియర్ నేతలు విజయవాడలో ఉండి కూడా ఈ కార్యక్రమానికి డుమ్మాకొట్టారు… ఇక ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కాగా ఇక మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ఆదే రూట్లో ఉన్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది…