ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం భారీ ప్లాన్ వేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. ఆయన కుమారుడు వెంకటేష్ కు చీరాల సేఫ్ జోన్ కాదని అద్దంకినే సేఫ్ జోన్ అని భావిస్తున్నారట…
అందుకే వెంకటేష్ ను వైసీపీలో జాయిన్ చేయాలని చూస్తున్నారట… ఎన్నికల సమయంలో గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దీంతో అద్దంకిలో రవి చీరాలలో కరణం పోటీ చేశారు. అదృష్టవ శాత్తు వీరిద్దరు గెలిచారు… ఈ రెండు ఫ్యామిలీలు ఒకే పార్టీలో ఉన్నా కూడా ఉప్పు నిప్పులా ఉంటాయి…
అందుకే కరణం తన కుమారుడుని వైసీపీలో జాయిన్ చేసి అద్దంకిలో పోటీ చేయించాలని చూస్తున్నారట అందులో భాగంగానే ఇటీవలే బలరాం వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి బర్త్ డేకు వచ్చి ఆయనతో మంతనాలు జరిపారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు