బాబు అవినీతి పై కేంద్రం విచారణ చేయాలి టీడీపీ ఎమ్మెల్యే

బాబు అవినీతి పై కేంద్రం విచారణ చేయాలి టీడీపీ ఎమ్మెల్యే

0
77

ఏపీలో ఇప్పుడు అంతా ఐటీ అధికారుల దాడుల గురించి చర్చ జరుగుతోంది.. చంద్రబాబు దగ్గర పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించి డాక్యుమెంట్లు దొరికాయి అని వార్త వైరల్ అవడం.. దీనిపై వైసీపీ నేతలు కూడా ఆరోపణలు చేయడంతో ఇవి రాజకీయ ఆరోపణలుగా మారిపోయాయి.

అయితే తాజాగా దీనిపై వైసీపీ నేతలేకాదు , తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కామెంట్లు చేశారు. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువని.. ఇంకా పెద్ద కుంభకోణాలు చాలా ఉన్నాయన్నారు. మొత్తం విచారించి బయటకు తీసుకురావాలి అన్నారు.

ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో బాబు అనుచరులకు సంబంధించి అనేకమంది బాగోతాలు బయటపడతాయి అని అన్నారు. నీతి నిజాయతీ అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు, దీనిపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలి అని ఆయన కోరారు. దీనిపై మీడియా ఎందుకు మాట్లాడటం లేదని బాబు వ్యవస్ధలని మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు…ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆరోపించారు మద్దాలి గిరిధర్.