చంద్రబాబుకు బిగ్ షాక్ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్….

చంద్రబాబుకు బిగ్ షాక్ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్....

0
88

త్వరలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో… రానున్న మరికొద్ది రోజుల్లో పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకునేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

పాలకొళ్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు త్వరలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి… అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరపున తన వాయిస్ బలంగా వినిపించిన రామానాయుడు… ఇప్పుడు ఆయన చేసే హడావుడి తమ్ముళ్లకు డౌట్ పుట్టిస్తోందట…

పార్టీ పరంగా కార్యక్రమాలను ఎంత స్పీడుగా చేస్తున్నారో అంత స్పీడుగా వైసీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారట… పాలకొళ్లులో వైసీపీ తరపున సరైన నాయకుడు లేనందున ఆయన ఆటువైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి… కాగా పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట… 2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది… ఇక 2019 ఎన్నికల్లో ఉండీ పాలకొళ్లులో మాత్రమే గెలిచింది…