టీడీపీ ఎమ్మెల్యేల్లో జంపింగ్ ఈయనతోనే స్టార్ట్

టీడీపీ ఎమ్మెల్యేల్లో జంపింగ్ ఈయనతోనే స్టార్ట్

0
99

త్వరలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం త్వరలో పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి…

జగన్ సునామిని తట్టుకుని బలరాం 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెగా పోటీ చేసి గెలిచారు… ఇప్పుడు ఆయన కూడా వైసీపీలో చేరితే టీడీపీ సభ్యుల సంఖ్య 22కు చేరుకుంటుంది… ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్ గా మారిన సంగతి తెలిసిందే…

మరో వైపు మాజీ ముంత్రులు కూడా వైసీపీలోకి క్యూ కడుతున్నారు… ఇప్పటికే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్, రామసుబ్బారెడ్డి వంటి కీలక నేతలు సైకిల్ ను దిగి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్నారు… ఇక రేపో మారో టీడీపీ పెద్ద దిక్కు జగన్ ప్రత్యర్థి సతీష్ రెడ్డికి కూడా వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి