టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా

టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా

0
110

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు… తన రాజీనామా లేఖను వాట్సప్ ద్వారా చంద్రబాబు నాయుడుకు పంపారు… వంశీ రాజకీయ అరంగేట్రం చేసిన నాటినుంచి టీడీపీలోనే ఉన్నారు…

ఆయనకు చంద్రబాబు నాయుడుకు దగ్గరం మంచి సంబంధం ఉంది. అలాంటి నేత ఇప్పుడు పార్టీ మారితే ఆ పార్టీకి ఎదురు దెబ్బే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. కాగా వంశీ ఒకే రోజు తన బందువు బీజేపీ నేత సుజనా చౌదరితో అలాగే బాల్యమిత్రుడు మంత్రి కొడాలినాని మరో మంత్రి పేర్నినానిలతో భేటీ అయ్యారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు… దీంతో అందరు వంశీ వైసీపీలో చేరుతారని అనుకున్నారు… అందుకే వైసీపీ నేతలతో సమావేశం అయ్యారని ప్రచారం సాగింది. అందులో భాగంగానే ఆయన టీడీపీకి రాజీనామా చేశారని అంటున్నారు..