టీడీపీ ఎమ్మెల్యేకి గాలం వేస్తున్న వైసీపీ

టీడీపీ ఎమ్మెల్యేకి గాలం వేస్తున్న వైసీపీ

0
98

జగన్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేకి వైసీపీ గాలంవేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ పై అసెంబ్లీలో అలాగే మీడియా పాయింట్లలో కూడా తీవ్ర స్దాయిలో విమర్శలు చేస్తున్న సదరు నేతని, వైసీపీ టార్గెట్ చేసింది అంటున్నారు.. అయితే ఆయన వైసీపీలోకి వస్తే కచ్చితంగా పార్టీకి ప్లస్ అవుతుంది అంటున్నారు.

కాని ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరాలి అంటే అది కుదరిని పని, ఎక్కడో పార్టీలో చిన్న కార్యకర్తని తీసుకువచ్చి చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్యే స్దానం ఇచ్చారు… అలాంటి నాయకుడు పార్టీకి ద్రోహం చేయరు అని టీడీపీ నేతలు అంటున్నారు.. అందుకే ఆయన పార్టీలో ఉంటారు అని అంటున్నారు.. ఇటీవల ఆయన వైసీపీ పై జగన్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నారు.

దీంతో ఆయనకు కూడా వైసీపీ గాలం వేస్తోంది అంటున్నారు.. అయితే వైసీపీ గాలం వేసినా ఆయన వైసీపీలో చేరరు అంటున్నారు టీడీపీ నేతలు. ఆయనకు టీడీపీ రాజకీయంగా మంచి పదవులు ఇచ్చింది కాబట్టి ఆయన టీడీపీలోనే కొనసాగుతారు అంటున్నారు, మొత్తానికి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేము అంటున్నారు మేధావి వర్గం.