డిఫరెంట్ స్టైల్ లో ఇద్దరు యువ ఎంపీలు…

డిఫరెంట్ స్టైల్ లో ఇద్దరు యువ ఎంపీలు...

0
76

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చాలామంది ఎంపీలు ఉన్నప్పటికీ ఆ ఇద్దరు ఎంపీలు మాత్రం చాలా స్పెషల్… వారిలో ఒకరు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్.. మరోకరు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు…

ఇద్దరు ఎంపీలు యువ ఎంపీలే… వైసీపీ ఎందరో యువ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ ఇద్దరికి మాత్రమే ప్రాధాన్యత పెరుగుతొందని విశ్లేషకులు అంటున్నారు… ఈ ఇద్దరు జగన్ కు అత్యంత విధేయులే… నిజానికి వీరిద్దరు తొలిసాని ఎంపీగా ఎన్నికైన తర్వాత తమ పని తాము చేసుకుంటు వేళ్తున్నారు…

నియోజకవర్గంలోని సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు… వీరిద్దరు అందరిని కలుపుకుని వెళ్తు ముందుకుసాగుతున్నారు… ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో వీరిద్దపై కీలక చర్చ సాగుతోంది…. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పరామర్శించలేదు…

కానీ ఇటీవలే లావు శ్రీకృష్ణ దేవరాయులు రైతుల సమస్యలను విని వారికి భరోసా ఇచ్చారు… అలాగే సురేష్ కూడా రాజధాని విషయంలో డిఫరెంట్ స్టైల్ లో దూకుడు ప్రదర్శిస్తున్నారు… రాజధాని విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు..