అమారావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది…. అమరావతిని మార్చోద్దంటూ రాజధాని రైతులు రోడ్డుపై భైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు…. ఈ నిరసనలకు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది…
రాజధాని ప్రాంతం అయిన వెలగపూడిలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు…. ఈ నిరసనలకు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలిపారు… అమరావతినే రాజధానికిగా కొనసాగించాలని నినాదాలు చేశారు…
ఈ కార్యక్రమాని పెద్ద సంఖ్యలు ప్రజలు హాజరు అయ్యారు… దీంతో ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు…. నిరసనకు అనుమతిలేదని చెప్పారు… ఈ క్రమంలో పోలీసులకు నిరసన కారులమధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉమాను అదుపులోకి తీసుకున్నారు… దీంతో గొల్లపూడిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది…