టీడీపీ ఎమ్మెల్యే వంశీ తర్వాత నెక్ట్స్ ఆ ఎమ్మెల్యేనట రాజీనామా చేసేది

టీడీపీ ఎమ్మెల్యే వంశీ తర్వాత నెక్ట్స్ ఆ ఎమ్మెల్యేనట రాజీనామా చేసేది

0
103

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రోజుకు ఒక కలర్ లో మారుతున్నాయి… ఏ పార్టీ నాయకులు ఎక్కడికి జంప్ చేస్తారో అర్థంకాని పరిస్థితిలో ఉంది…ముఖ్యంగా టీడీపీలో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా కనిపిస్తోంది….. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది సైకిల్ కు గుడ్ బై చెబుతున్నారు…

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా రాజీనామా చేశారు. ఆయన తర్వాత మరో ఎమ్మెల్యే కూడా టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారని బీజేపీ చెబుతోంది…

తాజాగా రఘురాం మీడియాతో మాట్లడుతూ… వంశీతో పాటు మరో నేత గంట శ్రీనివాసరావు కూడా వైసీపీ, బీజేపీలతో సంప్రదింపులు చేస్తున్నారని అన్నారు… ప్రస్తుతం వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. వారికి బీజేపీ అండగా ఉంటుందని అన్నారు రఘురాం…