మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుంది… ఆ పార్టీనుంచి సుమారు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారట… వారు పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారట…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మంచి ముహూర్తం చూసుకుని టీడీపీ కండువాను వీడి వైసీపీ కండువాను భూజాన వేసుకోవాలని చూస్తున్నారట… విశాఖ నుంచి ఇద్దరు… ప్రకాశం నుంచి ఒకరు… ఉభయ గోదావరి జిల్లానుంచి మరోకరు వైసీపీలో చేరాలని చూస్తున్నారట…
అంతేకాదు అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్దం చేసుకున్నారట… కాగా ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను కోల్పోయిన చంద్రబాబు నాయుడు ఈ షాక్ నుంచి కోలుకోక ముందే త్వరలో మరో గట్టి షాక్ తగలనుందని అంటున్నారు… మరి చూడాలి ఆ నలుగురు ఎమ్మెల్యేలకు టీడీపీ అధిష్టానం ఎలాంటి బుజ్జగింపులు చేస్తుందో…