ఎర్రన్నాయుడు కుమార్తెకు బాబు బంపర్ ఆఫర్

ఎర్రన్నాయుడు కుమార్తెకు బాబు బంపర్ ఆఫర్

0
102

ఎన్నికల వేళ రాజకీయంగా ఎవరి బంధాలు ఎవరి బంధుత్వాలు ఏమిటి అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు.. అవును దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి అయిన ఆదిరెడ్డి భవాని ,రాజమండ్రి సిటి నుంచి టికెట్ పొందారు.. గత ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఇక్కడ ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి తెలుగుదేశం సింగిల్ గా బరిలోకి దిగుతోంది అనేక మంది పేర్లు వినిపించినా, చివరకు ఆమె పేరు ఫైనల్ అయింది. దీంతో సిక్కోలులో కూడా ఆనందంగా ఉన్నారు ఎర్రన్న అభిమానులు.

ఆదిరెడ్డి భవానీ ఎర్రన్నాయుడు కుమార్తె, రామ్మోహన్ నాయుడు సోదరి, ఆదిరెడ్డి అప్పారావు కోడలు.మొదట్లో ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇవ్వాలని కోరారు.. కాని ఇక్కడ మహిళను బరిలోకి దించుదాము అని భావించి ఆమెకు టికెట్ ఇచ్చారు. ఇక ఆమెకు విజయం తథ్యం అని ఇక్కడ నేతలు చెబుతున్నారు.. వైసీపీ తరపున జనసేన తరపున వారికి ఇక్కడ డిపాజిట్లు కూడా రావు అని అంటున్నారు..వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు బరిలోకి దిగుతున్నారు.. జనసేన నుంచి అనుశ్రీ ఫిలింస్ అధినేత సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అయితే ఆదిరెడ్డి కుటుంబం నుంచి మహిళ బరిలోకి దిగడంతో ఈ రెండు పార్టీలకు కాస్త టెన్షన్ పట్టుకుంది.