టీడీపీ ఆఫీస్ కు తాళం….

టీడీపీ ఆఫీస్ కు తాళం....

0
86

ఆరు నెలల నుంచి కరెక్ట్ గా ఏడాదిలోపు టీడీపీ ఆఫీస్ మూత పడుతుందా అంటే అవుననే అంటున్నారు అధికార వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్… తాజాగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు… ఆ తర్వాత మీడియతో మాట్లాడుతూ ఏడాదిలోపు టీడీపీ మూత పడిపోతుందని స్పష్టం చేశారు…

చీరాలలో రాజకీయంగా ఎలాంటి మార్పులు లేవని జగన్ స్పష్టం చేశారని తెలిపారు… గతంలో చేరికలు ఇప్పుడు చేరికలు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు… గతంలో వైసీపీ నేతలను టీడీపీలోకి రావాలంటూ ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకున్నారని అలాగే చాలా మంది ఎమ్మెల్యేలకు డబ్బులు కూడా ఇచ్చారని తెలిపారు…

కానీ జగన్ అలా కాదని స్పష్టం చేశారు… వైసీపీ విధానాలు నచ్చి వైసీపీలో చేరుతున్నారని తెలిపారు… వైసీపీలో చేరేవారికి ఎలాంటి హామీలు ఇవ్వడంలేదని ఎలాంటి పెద్దపదవులు ఇస్తామని చెప్పడంలేదని స్పష్టం చేశారు… త్వరలో టీడీపీ మూతపడుతుందనే ఉద్దేశంతో వైసీపీలోకి చేరుతున్నారని స్పష్టం చేశారు ఆమంచి…