వెంటిలేటర్ పై టీడీపీ… బ్రతికించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం…

-

దళితులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కపట ప్రేమ చూపుతున్నారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దళితులను అవమానించారని అలాగే ఆయన కేబినెట్ లో పనిచేసిన మంత్రి కూడా దళితులను అవమానించారని మండిపడ్డారు…

- Advertisement -

ప్రస్తుతం టీడీపీ నేతలు కొంతమంది దళితులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు… గతంలో చంద్రబాబు నాయుడు రాజ్యంగ బద్దంగా దళితులకు దక్కాల్సిన హక్కులను హరించారని ఎమ్మెల్యే మేరుగ ఆరోపించారు… దళితులపై దాడులు చేస్తే ఎంతటివారిపైన అయిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారని అన్నారు…

చంద్రబాబు నాయుడు దళితులను అడుగడుగునా అవమానించారని ఎంపీ నందిగామ సురేష్ మండిపడ్డారు…చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బ్రతించుకునేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సురేష్ అంతేకాదు… ఈనెల 31 డాక్టర్ అంబెత్కర్ విగ్రహం వద్ద నిరసనలు తెలుపుతామని అన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...