టీడీపీ పార్టీని బ్రతికించే దిక్కెవరు ?

టీడీపీ పార్టీని బ్రతికించే దిక్కెవరు ?

0
96

ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పేరు ఆపార్టీ కార్య కర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు.

అయితే ఇప్పుడు టీడీపీ ఓటమి గురించి మాట్లాడటం కంటే ఆ పార్టీకి ఇప్పుడు భవిష్యత్ నాయకుడెవరన్నది అసలైన ప్రశ్న. సీనియర్ ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు ఆ పార్టీని 30 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ అధికారంలో కొన్నాళ్ళు, ప్రతిపక్షంలో కొన్నాళ్ళు ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు వయసు 70 ఏళ్లకు దగ్గరకు వచ్చింది. మరో పదేళ్లు పోతే చంద్రబాబు ఆ పార్టీని మోసే పరిస్థితిలో ఉండకపోవచ్చు.

ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే ఆరోగ్య కారణాల రీత్యా అమెరికాకు వెళ్లారు. దీనితో చంద్రబాబుకు వయసయిపోయిందని ఇట్టే అర్ధమవుతుంది. చంద్రబాబు ఇలా అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ కు వెళ్లుతున్నాడంటే ఆ పార్టీని నడిపించేందుకు ఖచ్చితంగా మరొకరు పార్టీ పగ్గాలు. మరి ఎవరికీ పగ్గాలు ఇవ్వాలి ? లోకేష్ మీద ఆశలు పెట్టుకుంటే, అతను కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడు ట్విట్టర్ లోనే కాలక్షేపం చేస్తున్నారు. దీనితో టీడీపీ పరిస్థితి ఏంటని ఆఫ్ ది రికార్డు కొంత మంది నేతలు చెప్పుకోవటం విశేషం. లోకేష్ తరువాత బాలయ్య బాధ్యతలు చేపట్టవచ్చు. కానీ బాలయ్య కు ఆ ధ్యాసే లేదు. ఇక వీరే వారికీ పార్టీ పగ్గాలు అప్పగించడానికి బాబు గారు ఎవరిని నమ్మే వ్యక్తి కాదన్న సంగతీ అందరికీ తెలిసిందే.