టిడిపికి పోటీ చేసే అర్హతే లేదా ?

టిడిపికి పోటీ చేసే అర్హతే లేదా ?

0
88

ఈనెల 26వ తేదీన భర్తీ అవ్వబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి పోటీ చేసే అర్హత కూడా లేదని తేలిపోయింది. ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వాల్సిన మూడు స్ధానాలకు ఈ నెల 26వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ తో ఒకవైపు తెలుగుదేశంపార్టీని నైరాస్యంలో పడేస్తే మరోవైపు వైసిపి నేతలు మాత్రం ఫుల్లు ఖుషీగా ఉన్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి, టిడిపి తరపున పోటీ చేసిన ఆళ్ళనాని, కోలగట్ల వీరభద్రస్వామి, కరణం బలరామ్ గెలిచారు. అప్పటి వరకూ వాళ్ళు ముగ్గురూ ఎంఎల్ఏల కోటాలో నామినేట్ అయిన ఎంఎల్సీలన్న విషయం అందరకీ తెలిసిందే. ఎప్పుడైతే ఆ ముగ్గురు ఎంఎల్ఏలుగా గెలిచారో వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసేశారు.

దాంతో ఖాళీ అయిన మూడు స్ధానాలకే ఎన్నికల సంఘం ఇపుడు నోటిఫికేషన్ జారీ చేసింది. సరే ఖాళీ అయిన మూడు స్ధానాలు కూడా అధికార వైసిపినే దక్కించుకుంటుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో సంఖ్యా బలం రీత్యా 151 మంది ఎంఎల్ఏల బలమున్న వైసిపికే దక్కుతాయి. ఒకవేళ పోటీ జరగాలంటే ప్రతీ ఎంఎల్సీ పదవికి 44 మంది ఎంఎల్ఏలు ఓట్లు వేయాలి.

అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారమైతే టిడిపికి ఉన్నదే 23 మంది ఎంఎల్ఏలు. పోటి అనివార్యతమైతే కావాల్సింది 44 మంది ఎంఎల్ఏలు. కాబట్టి టిడిపి అసలు పోటీ గురించి ఆలోచించే అవకాశం కూడా లేదని తేలిపోతోంది. అసలు పోటీ గురించి ఆలోచించే అవకాశం లేని చోట టిడిపి పోటీ గురించి ఆలోచిస్తే ఆమధ్య తెలంగాణాలో ‘ఓటుకునోటు’ లో తగులుకున్న విషయం గుర్తుంది కదా అలాగే తగులుకోవల్సుంటుంది. ఇవే కాదులేండి స్ధానిక సంస్ధల ఎన్నికల తర్వాత భర్తీ అవ్వబోయే ఐదు ఎంఎల్సీలను కూడా వైసిపినే గెలుచుకుంటుందనటంలో సందేహమే లేదు.