టీడీపీ సీనియర్లు సంచలన నిర్ణయం

టీడీపీ సీనియర్లు సంచలన నిర్ణయం

0
118

తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కు అప్పగించాలి ఆయనే పార్టీని కాపాడాలి అని కొందరు నేతలు చేస్తున్న కామెంట్లపై ముఖ్యంగా టీడీపీలో విమర్శలు వస్తున్నాయి.. ఇంత కాలం చంద్రబాబు పార్టీని ముందుకి నడిపించారు.. అధికారంలో ఉన్నంత సేపు బాబు వెంట ఉండి ..ఆయన పదవులు ఇస్తే తీసుకున్నారు. అన్నీ అనుభవించి జగన్ చెంతకు చేరి, కావాలనే ఇలాంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు టీడీపీ నేతలు.

ముఖ్యంగా సీనియర్లు చాలా మంది అదే చెబుతున్నారు. వైసీపీ ఇప్పుడు ఉన్నటు వంటి మెజార్టీ నేతలతో మరింత మందిని ఆకర్షిస్తోందని, గతంలో చంద్రబాబు దగ్గరకు పార్టీ మారి కొందరు వచ్చారు అని కూడా విమర్శిస్తున్నారు టీడీపీనేతలు..

ఇప్పుడు కావాలనే జగన్ పార్టీ నేతలు తెలుగుదేశం నేతలను ఆకర్షిస్తున్నారు అని అంటున్నారు.. చంద్రబాబు కి మాత్రం తాము అండగా ఉంటాము అని చెబుతున్నారు సీనియర్లు, తాజాగా సీనియర్ నేతలు అందరూ ఈ విషయం పై చర్చించుకున్నారట.