టీడీపీ కొట్టే దెబ్బకు వైసీపీ కోలుకోలేదు భారీ షాక్

టీడీపీ కొట్టే దెబ్బకు వైసీపీ కోలుకోలేదు భారీ షాక్

0
187

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో కూడా ఇంతే హాడావుడ చేసింది.. తామే గెలుస్తాం జగన్ సీఎం అని చెప్పారు.. వాస్తవంగా చూసుకుంటే జగన్ సీఎం అవ్వలేదు.. అలాగే 70 సీట్లు కూడా రాలేదు. ఇవన్నీ ఆ పార్టీకి చాలా మైనస్ అయ్యాయి.. అయితే పలు సర్వేలు చూస్తే ఇప్పుడు కూడా అలాంటి రిజల్ట్ వస్తాయి అని చెబుతున్నారు దీనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. జగన్ కు సీఎం అయ్యే ఛాన్స్ ఇప్పుడు కూడా లేదు అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. ఇక తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా చాలా ధీమాగా ఉన్నారు.. తన సర్వేల్లో కూడా దాదాపు 120 సీట్లు వస్తాయి అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఆ పార్టీకి నెగిటీవ్ అవుతున్నాయి.

తాజాగా టీడీపీ జిల్లాల నుంచి తెప్పించిన సర్వేల్లో షాకింగ్ న్యూస్ వచ్చింది.. కడప జిల్లా మినహా ఎక్కడా కూడా వైసీపీ దూసుకుపోయే చాన్స్ లేదు అని కడపలో 7 స్ధానాలు వైసీపీ గెలుచుకుంటుంది అని, మిగిలిన స్ధానాలు చాలా వరకూ తెలుగుదేశం గెలుచుకుంటుంది అని తేలిందట.. అంతేకాదు ఈసారి సీనియర్లు వైసీపీలో సీట్లు పొందిన వారు కూడా ఓటమి పాలు అవుతారు అని తేలిందట.. ఇక తెలుగుదేశం నుంచి చివరి నిమిషంలో పార్టీలు మారి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన వారు కూడా ఓడిపోతారు అని తేలింది.. అంతేకాదు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుస్తారు అని జగన్ భావిస్తున్నారు.. కాని వాస్తవంగా ఫలితాలు ఫుల్ రివర్స్ అవుతాయి అని చెబుతున్నాయి ఈ సర్వేలు. ముఖ్యంగా వైసీపీలో ఎవరు గెలుస్తారు అని భావిస్తున్నారో వారు ఓటమి చెందే అవకాశం ఉంది అని తేలిందట.. అందుకే బాబు అంతదైర్యంగా ధీమాగా తామే గెలుస్తాం అని సర్వేలు చూసి చెబుతున్నారట.