అనంతపురంలో తెలుగుదేశం పార్టీ రికార్డ్ బ్రేక్

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ రికార్డ్ బ్రేక్

0
109

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన దూకుడు చూపిస్తుంది అని చెబుతున్నారు పార్టీ నేతలు..గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు వైసీపికి మిగిలేలా చేసింది.. కదిరి నుంచి కూడా ఎమ్మెల్యే పార్టీ మారి వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరారు.. తర్వాత ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఈసారి ఉరవకొండలో కూడా పయ్యావుల కేశవ్ గెలుపు పక్కా అని అంటున్నారు. అందుకే అనంతపురం జిల్లాలో మొత్తం స్ధానాలు అన్నీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అంతే ధీమాగా తెలియచేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కేవలం ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు అని ఇటు పొలిటికల్ అనలిస్టులు కూడా చెబుతున్నారు.. ఇక్కడ ఈసారి జిల్లాలో 14 కు 12 టీడీపీ పక్కాగా గెలుస్తుంది అని, మరో రెండు టఫ్ ఫైట్ ఉంటాయని చెబుతున్నారు..అంతేకాదు కదిరి ఉరవకొండ పక్కాగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని డ్యాష్ బోర్డు సర్వేల్లో తేలిందట.. వైసీపీ మాత్రం తామే గెలుస్తాం అని చెబుతున్నా ఇక్కడ అంత సీన్ లేదు అని సర్వేలు చెబుతున్నాయి.. ఇక జిల్లాలో వైసీపీ కోట్లు కుమ్మరించింది అని, అందుకే తాము గెలుస్తాం అని ధీమాగా వారు చెబుతున్నారు అని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు.