జగన్ సర్కార్ కు రాజధాని విషయంలో టీడీపీ సవాల్

జగన్ సర్కార్ కు రాజధాని విషయంలో టీడీపీ సవాల్

0
88

రాజధాని విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. రైతులంతా ఆధార్ కార్డులు, భూమి పత్రాలు పట్టుకొని విజయసాయిరెడ్డి ఎప్పుడు దర్శనమిస్తారా అని ఎదురుచూస్తున్నారని అన్నారు…
సిగ్గు లేకుండా రైతులను పెయిడ్ ఆర్టిసులు అని అవమానపరుస్తారా? మిమ్మల్ని రైతు లోకం క్షమించదని ఆరోపించారు.

రైతులకు పార్టీ రంగు పూసి రాక్షస ఆనందం పొందుతారా అని ప్రశ్నించారు వైసీపీకి మద్దతు పలికిన రైతులు కూడా మీ తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంటున్నారని అన్నారు. మీకు ఓటు వేసిన వారిని కూడా పెయిడ్ ఆర్టిసులు అని అవమానించే కుసంస్కారం వైసీపీదని అన్నారు..

రాజధాని ప్రకటనకి ముందే రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇప్పుడు ప్రకటన వచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్లు మొదలుపెడతారని ఆరోపించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే జగన్ పాలన వచ్చిన తరువాత విశాఖలో భూముల అక్రమాలపై సిట్ విచారణకి అంగీకరించాలని డిమాండ్ చేశారు..