ఫ్లాష్ న్యూస్ ..సాక్షికి టీడీపీ గట్టి షాక్

ఫ్లాష్ న్యూస్ ..సాక్షికి టీడీపీ గట్టి షాక్

0
86

ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య వార్ మరింత ముదిరింది ..ఇటీవల చంద్రబాబు పీఏ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఇందులో దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఆయన ఇంట దొరికాయి అనేలా వార్తలు వినిపించాయి.. దీనిపై కావాలనే వైసీపీ నేతలు వైసీపీ మీడియా అతస్య ప్రచారం చేశారు అని టీడీపీ విమర్శలు చేసింది.

తమ పై తమ నాయకుడిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇటువంటి వార్తలు ప్రచురించిన సాక్షిని బ్లాక్లిస్ట్లో పెట్టేందుకు తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంలో ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నందుకు, కచ్చితంగా కంప్లైంట్ ఇస్తాము అని తెలిపారు ఆయన..తాము ప్రెస్ కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

కావాలనే చంద్రబాబుపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులని పనిగట్టుకుని చెడు వార్తలు అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వాటిని తిప్పికొడతాము అని అన్నారు, సోషల్ మీడియాలో కూడా దారుణంగా విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని సాక్షిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు.