ఫ్లాష్ న్యూస్ ….సాక్షికి షాకిచ్చిన టీడీపీ

ఫ్లాష్ న్యూస్ ....సాక్షికి షాకిచ్చిన టీడీపీ

0
96

తెలుగుదేశం పార్టీ నేతలు సాక్షి పత్రికపై విమర్శలు చేస్తున్నారు.. కావాలనే తెలుగుదేశం నేతలపై చంద్రబాబుపై అసత్య వార్తలు రాస్తున్నారని విమర్శలు చేస్తోంది టీడీపీ, అయితే తాజాగా ఏపీలో జరిగిన ఐటీ దాడులకు సంబంధించి అసత్య వార్తలు రాస్తున్నారని విమర్శలు చేశారు.. దీనిపై సాక్షి మీడియాపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.

ఐటీ దాడుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధం లేని విషయాలను ఆపాదిస్తూ వార్తలు ప్రచురించారని ఇలాంటి అసత్య వార్తలు రాస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు, అంతేకాదు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ యనమల ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు రాసిన లేఖలో ఈ విషయాలు తెలిపారు.

జర్నలిజం ప్రమాణాలను దిగజారుస్తున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి పత్రిక గురించి చర్చించుకోవాలి అని తెలిపారు, అంతేకాదు అసత్య వార్తలకు సంబంధించినవ ఈడియోలు క్లిప్పింగులు పేపర్లు కూడా పంపింది టీడీపీ.