కాస్త ఆగండి వైసీపీకి టీడీపీ ఝలక్

కాస్త ఆగండి వైసీపీకి టీడీపీ ఝలక్

0
100

ఏపీలో ఇంకా ఫలితాలు రాలేదు కాని, వైసీపీ మంత్రి వర్గ విస్తరణ 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం అంటోంది. అలాగే పులివెందులలో జగన్ ప్రమాణ స్వీకారం ఇలా అనేక రకాల వార్తలను సోషల్ మీడియాలో వదులుతున్నారు.. మెత్తానికి ఆలూ లేదు చూలు లేదు అనే సామెత ఇప్పుడు వైసీపీకి బాగా సూట్ అవుతుంది అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు… అసలు ఫలితాలు ఎలా వస్తాయో తెలియకుండా జగన్ కు ఇంత కంగారు ఎందుకు, ఒకవేళ వైసీపీ నేతలు క్రింది స్దాయి నేతలు ఇలాంటి పనులు చేస్తున్నా, కచ్చితంగా వారిని కట్టడి చేయాల్సిన వారు పార్టీ పెద్దలు.. మరి వారు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే సమాధానం ఉండదు, 2014 ఎన్నికల సమయంలో ఇలాగే అన్నారు 130 స్దానాల్లో గెలుస్తాం అన్నారు .కరెక్టుగా సగం గెలిచారు.

ఇప్పుడు 120 గెలుస్తాం అని చెబుతున్నారు. మళ్లీ అందులో సగం అంటే 60 సీట్లు మాత్రమే వస్తాయి అని విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం నేతలు.. ముందు వాస్తవంగా ఫలితాలు వచ్చే వరకూ ఇలాంటి గొప్పలకు పోకూడదు అని చెబుతున్నారు.. ఇటు జగన్ తన నోటితో 120 సీట్లు వస్తాయి అని చెప్పకుండా నేతలతో ఇలా వార్తలు ప్రచారం చేయిస్తున్నారు అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు, అసలు ఫలితాలు వచ్చే రోజు వరకూ వెయిట్ చేయండి అని సలహా ఇస్తున్నారు.