కొడాలి నానిని మళ్లీ టార్గెట్ చేసిన టీడీపీ…. ఈ సారి ఏకంగా

కొడాలి నానిని మళ్లీ టార్గెట్ చేసిన టీడీపీ.... ఈ సారి ఏకంగా

0
98

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తోంది… ఆయనపై వరుసగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు… మొన్న వర్లరామయ్య తదితరులు కలిసి పోలీసులకు కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే…

నాని చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాలో పేర్కొన్నారు… ఇదే క్రమంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి దేవినేని ఉమా నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు… లారీతో తొక్కించి చంపుతామని తమను బెధిరించారని ఫిర్యాదులోపేర్కొన్నారు…

కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, వసంత కృష్ణ ప్రసాద్ లపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమేయంతోనే బెధిరిస్తున్నారని ఉమ తెలిపారు… వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు… ప్రశ్నిస్తే వారిపై బౌతికదాడులు చేస్తారా అని ప్రశ్నించారు… రానున్న రోజులు ఈ అరాచకాలపై ప్రజలు తిరగబడతారని అన్నారు…