టీడీపీ తమ్ముళ్లు తలో దారి

టీడీపీ తమ్ముళ్లు తలో దారి

0
99

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగు తమ్ముళ్లు తలో దారి చూసుకుంటున్నారు… పార్టీని, పార్టీనేతలను యాక్టివ్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తుంటే తమ్ముళ్లు మాత్రం తమ రాజకీయ దృష్ట్య ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా రేపో మాపో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి… ఇక ఆయన తర్వాత మరికొందరు టీడీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు… జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే టీడీపీ కండువాను వీడి వైసీపీ కండువాను భూజాన వేసుకుంటామని చెబుతున్నారు…

మరి వారిని చంద్రబాబు నాయుడు ఎలా భుజ్జగిస్తారో చూడాలి… ఎందుకంటే వీరుకానీ వైసీపీలో చేరితే మరికొందరు కూడా పార్టీని వీడేందుకుసిద్దంగా ఉన్నారని గుసగుసలు…