టీడీపీ నుంచి వైసీపీలోకి క్యూ ….

టీడీపీ నుంచి వైసీపీలోకి క్యూ ....

0
127

త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగనుందా అంటే అవుననే అంటున్నారు మంత్రి బొత్స సత్య నారాయణ తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… త్వరలో టీడీపీ నుంచి అనేకమంది వైసీపీలోకి రానున్నారని తెలిపారు…

వారందూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారని తెలిపారు… అలాగే పరోక్షంగా విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరిపై కూడా ఫైర్ అయ్యారు… సమాజంలో గౌరవంగా ఉంటున్నామనుకున్న నేతలు ఆచితూచి మాట్లాడాలని అన్నారు..

ఓడిపోయిన నేతలు అలాగే మాట్లాడతారని పరోక్షంగా విమర్శలు చేశారు.. కాగా ఇప్పటకే టీడీపీ నుంచి చాలామంది నేతలు వైసీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే… ఇక నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ రెబల్ గా మారి వైసీపీ మద్దతు పలికారు.