2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు తమ భవిష్యత్ రాజకీయాల కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… మరికొందరు టీడీపీ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు…
మరికొన్నిచోట్ల టీడీపీకి నాయకులు కరువయ్యారు… ముఖ్యంగా ఈ కొరత కడప జిల్లాలో ఎక్కువగా ఉంది సీఎం రమేష్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు వంటి వారు టీడీపీని వదిలి బీజేపీలో చేరారు… రానున్న రోజుల్లో మరికొత మంది టీడీపీని వీడే ఛాన్స్ ఉందని అంటున్నారు రాజకీయ మేధావులు..
దీంతో జిల్లాలో నేతలకొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు… ఇక కృష్ణా జిల్లాలో కూడా రానున్న రోజుల్లో నేతల కొరత ఎక్కువ ఏర్పడే అవకాశలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి… ఇటీవలే అవినాష్ వైసీపీలో చేరారు… రానున్న మరికొద్దిరోజుల్లో వల్లభనేని వంశీ కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు…
ఆయన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మరికొందరు టీడీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట… దీంతో ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల టీడీపీకి టులెట్ బోర్డ్ పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు..