ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు శాసనసభలో పాస్ చేస్తున్న బిల్లులకి మండలిలో తెలుగుదేశం సభ్యులు అడ్డుపడుతున్నారు.. ఈ సమయంలో తెలుగుదేశం నేతలకు చెక్ పెట్టేందుకు అలాగే ఆర్దిక భారం తగ్గించుకునేందుకు మండలి రద్దుకి ప్రతిపాదించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే మండలి రద్దుని స్వాగతిస్తున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ – మోపిదేవి స్వాగతించారు.
అందరూ స్వాగతించడం వేరు వీరిద్దరూ స్వాగతించడం వేరు ఎందుకు అంటే వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా కొనసాగుతున్నారు, దీంతో వీరి మంత్రి పదవులకు ఇక పదవీ గండం ఉన్నట్లుచెప్పాలి ,దీంతో వీరికి రాజకీయంగా ఇక ఎలాంటి పదవి ఉండదు, మరో ఆరునెలల్లో ఎమ్మెల్యే అయినా అవ్వాలి లేదా రాజీనామా అయినా మంత్రిపదవికి చేయాలి.
శాసన మండలి రద్దు ఫై ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తాత్కాలిక ప్రయోజనాల కోసం మండలిని రద్దు చేస్తే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రద్దు చేసినట్లు తెలిపారు. గడిచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో ప్రజలకు ఉపయోగపడే బిల్లులను అపహాస్యం చేసారని మంత్రి మోపిదేవి అన్నారు. ఇలా ఇద్దరూ కూడా జగన్ కు జై కొట్టారు దీంతో వైసీపీలో రెండు కోటరీలు లేవు అనేది తేలిపోయింది.