వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చేస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు… కాని అనుభవం ఉన్న చంద్రబాబు వల్ల మాత్రమే ఏమైనా సాధ్యం అవుతుంది అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. ముఖ్యంగా జగన్ పార్టీలో నేతలకు డబ్బులు ఉంటేనే టికెట్ ఈసారి ఇచ్చారు అని అంటున్నారు టీడీపీ నేతలు.. తాజాగా కష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పలు విమర్శలు చేశారు జగన్ పై.
ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని ఆదిశేషగిరిరావు ఆరోపించారు. రాష్ర్టం ఎలా అభివ్రుద్ది చెందుతుంది అని జగన్ కు అంత విజన్ లేదు అని విమర్శించారు ఆయన, ఏపీలో డవలప్ మెంట్ జరగాలి అంటే కేవలం చంద్రబాబు ఒక్కరే దీనికి కర్తకర్మక్రియ అని ఆయన తెలియచేశారు.
జగన్కు విజన్ లేదని, అధికారం ఇస్తే అభివృద్ధి ఆగిపోయినట్టేనని విమర్శించారు. పోలవరం, రాజధానిపై జగన్కు అవగాహన లేదని, పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ఏపీలో జగన్ కు అధికారం వస్తుంది అని వచ్చే సర్వేలు అన్నీ వేస్ట్ అని కొట్టిపారేశారు, తెలుగుదేశం పార్టీకి 110 అసెంబ్లీ అలాగే 18 ఎంపీ స్ధానాలు వస్తాయి అని ఆయన తెలియచేశారు.