టీడీపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైన నలుగురు ఎమ్మెల్యేలు

టీడీపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైన నలుగురు ఎమ్మెల్యేలు

0
108

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాసుపల్లి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు… తనపై టీడీపీ అనర్హత వేటు వేస్తే రాజీనామాకు సిద్దం అని సవాల్ విసిరారు… తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే మళ్లీ పోటీకి సిద్దం అని అన్నారు…

టీడీపీలో ఉన్న 16 నెలలు నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు… కాగా ఇటీవలే ఆయన వైసీపీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే… ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.. ఇక ఆ తర్వాత నుంచి టీడీపీ ఆయనపై ఎదురు దాడికి దిగింది…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై టీడీపీ చర్యలు తీసుకుంటే రాజీనామాకు సిద్దంగా ఉన్నానని అన్నారు… ఎన్నికల్లో టీడీపీతో తాడో పేడో తేల్చుకుంటానని అన్నారు… అలాగే తన వెంటేపాటు మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు…