త్వరలో బీజేపీలోకి భారీ వలసలు

త్వరలో బీజేపీలోకి భారీ వలసలు

0
110
Telangana BJP

తెలంగాణ వ్యాప్తంగా త్వరలో బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఆపరేషన్ ఆకర్షలో భాగంగా ఇప్టటికే ఏపీపై కన్నేసిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై కూడా కన్నేసింది. ఎన్నికల నాటికటికల్లా రాష్ట్రంలో తమ పట్టు సాధించుకోవాలని చూస్తోంది.

అందుకే బీజేపీ నాయకులు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి…ఈ ఆపరేషన్ లో భాగంగా మాజీ మంత్రి సుద్దాల దేవయ్య బీజేపీలో చేరేందుకు రంగం సిద్ద చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ తో ఆయన భేటీ అయ్యారు..

ఈ భేటీలో తాను పార్టీలో చేరిక గురించి చర్చించినట్లు సమాచారం అందుతోంది… ఇక దేవయ్య పార్టీలో చేరిన తర్వాత కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు.