బ్రేకింగ్ – తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాలు బంద్ ఎన్ని రోజులంటే

బ్రేకింగ్ - తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాలు బంద్ ఎన్ని రోజులంటే

0
96

ఈ క‌రోనా సమ‌యంలో మందు బాబుల‌కి నెల రోజులు మందు దొర‌క‌లేదు, త‌ర్వాత స‌డ‌లింపుల్లో భాగంగా మందు దుకాణాలు తెరిచారు, అయితే ఓ ప‌క్క కేసులు పెరుగుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో త‌క్కువ స‌మ‌యం మందు దుకాణాలు తెరుస్తున్నారు.

అయితే తెలంగాణ‌లో మ‌రోసారి మందు బాబుల‌కి బ్యాడ్ న్యూస్ ఎందుకు అంటే? బోనాల జాతర సందర్భంగా జంటనగరాల్లో ఈనెల 19వ తేదీ ఉదయం 6గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6గంటల వరకూ మద్యం దుకాణాలను మూసి ఉంచాలని నగర పోలీస్‌కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశించారు.

ఈ స‌మ‌యంలో మొత్తం న‌గ‌రంలో ఎక్క‌డా మందు దొర‌క‌దు.. ఎవ‌రూ అమ్మ‌డానికి ప్ర‌యత్నించ‌రు.
ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఆషాఢజాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జ‌రుగుతాయి, ఈ స‌మ‌యంలో ఎక్క‌డా మద్యం అమ్మ‌కాలు చేయ‌రు, ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు లేకుండా ముందుగా మ‌ద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు.