తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల అయింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 230 పని దినాలు ఉంటాయని ప్రకటించింది. జూన్ 12 నుండి వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.
అలాగే మొదటి ఎఫ్ఏ పరీక్షలు జులై 21 లోపు, రెండవ ఎఫ్ఏ పరీక్షలు సెప్టెంబర్ 5 లోపు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. ఇక ఎస్ఏ-1పరీక్షలు నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎఫ్ఏ-3 ఎగ్జామ్స్ డిసెంబర్ 21 లోపు, ఎఫ్ఏ -4 పరీక్షలను 10వ తరగతి విద్యార్థులకు జనవరి 31 లోపు, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28 లోపు నిర్వహించనున్నారు.
సెలవులు ఇలా..
దసరా సెలవులు – అక్టోబర్ 26 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు(14 రోజులు).
క్రిస్మస్ సెలవులు – డిసెంబర్ 22 నుంచి 28 వరకు(7 రోజులు).
సంక్రాంతి సెలవులు – జనవరి 13 నుంచి 17 వరకు(5 రోజులు).
ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.