కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శకత్వంలోనే నడుస్తం

0
88

కేంద్ర క్యాబినెట్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జీ.కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్.

ఢిల్లీ లోని కిషన్ రెడ్డి నివాసం లో ఆయన ను కలిసి బండి సంజయ్ సన్మానించారు.

కిషన్ రెడ్డికి సహాయ మంత్రి నుంచి క్యాబినెట్ మంత్రి గా అవకాశం కల్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.

కిషన్ రెడ్డి కృషికి, పార్టీకి, చేసిన సేవలకు తగిన గుర్తింపుగా తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

కిషన్ రెడ్డి కింది స్థాయి కార్యకర్త నుంచి క్యాబినెట్ మంత్రి ఎదగడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని సంజయ్ అన్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి  పాదయాత్ర, బస్సు యాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేసారని సంజయ్ చెప్పారు.

హోమ్ శాఖ సహా సహాయ మంత్రిగా అమిత్ షాకు ఎన్నో విషయాల్లో చేదోడు వాదోడుగా ఉన్న కిషన్ రెడ్డి ఎన్నో బిల్లులు ప్రవేశ పెట్టారని సంజయ్ గుర్తు చేశారు.

బీజేపీ కార్యకర్తలకు గౌరవం ఇస్తుందని మరో సారి నిరూపితం అయిందని ఆయన చెప్పారు.

కిషన్ రెడ్డి దర్శకత్వం లో తెలంగాణ లో బీజేపీని అధికారం లోకి తెస్తామని సంజయ్ చెప్పారు.