రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..నైట్ కర్ఫ్యూ, ఆంక్షలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్!

Telangana cabinet to meet tomorrow..night curfew, chance to decide on sanctions!

0
73

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నైట్ కర్ఫ్యూ, ఆంక్షలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

విద్యాసంస్థలకు సెలవులను మరోసారి పెంచింది సర్కార్. తెలంగాణాలో 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తూ విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా తదితర విషయాల మీద కేబినేట్ లో చర్చించనున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1963 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,07,162కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.