నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూఇయర్ సెలబ్రెషన్స్పై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారన్న హైకోర్టు వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
పబ్‌లు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచారని లాయర్లు ధర్మాసనానికి తెలిపారు. దిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు… పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని వ్యాఖ్యానించింది. కరోనాపై విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.
కాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నేడు అర్థరాత్రి వరకు బార్లు, వైన్స్‌ల ఓపెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు వేడుకలను కూడా కోవిడ్ నిబంధనలతో జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు డ్రంకన్ డ్రైవ్ తనీఖీలు కూడా విస్తృతంగా అమలు చేస్తామని మరోవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కొంతమంది న్యాయవాదుల పిటిషన్ వేశారు.