ఆ ఎంపీ దిగజారి మాట్లాడుతుండు : మంత్రి ప్రశాంత్ రెడ్డి

0
96

నిజామాబాద్: మాధవ నగర్ ఆర్వోబి విషయంలో ఎంపీ అర్వింద్ తన స్థాయిని దిగజారి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ అంశమైన రాష్ట్ర ప్రభుత్వం 63 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.కేంద్రం రైల్వే శాఖ తరుపున కేవలం 30 కోట్లే ఇస్తుందన్నారు.రైల్వే బ్రిడ్జ్ కోసం భూసేకరణ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.అర్వింద్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేయడం ఓ డ్రామా అన్నారు.

మాదవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటులో ఎవరు ఎంత కృషి చేశారో ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం నుండి నిదులు తేవాల్సిన ఎంపి ఆరవింద్ పనికిమాలిన వేషాలు వేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ధర్నా పేరుతో డ్రామాలు చెస్తున్న ఎంపి కి ప్రజలు బుద్ధిచెప్పేందుకు సిద్దమైతున్నారని అన్నారు.కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల అంచనా ప్రకారం పనిచేస్తున్నామని తెలిపారు.

మాధవ నగర్ బ్రిడ్జ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో నాలుగు ముఖ్యమైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణం ఉన్నదని త్వరలోనే వాటికి సంబంధించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.మాధవ నగర్ బ్రిడ్జ్ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందన్న దురుద్దేశంతోనే ఎంపీ అర్వింద్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.

మంత్రి వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల,ఎమ్మెల్సీ వి.జి గౌడ్,జడ్పీ చైర్మన్ విఠల్ రావు పలువురు ఉన్నారు.