ఉక్రెయిన్ లో తెలంగాణ విద్యార్థులు..కేసీఆర్‌ కీలక ఆదేశాలు..అందుబాటులోకి హెల్ప్ లైన్ కేంద్రాలు

0
87

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది.  తాజాగా ఉక్రెయిన్ లో భారతీయులు చిక్కునట్లు తెలుస్తుంది. వీరంతా ఇండియాకు తిరుగు ప్రయాణం కాగా అధికారులు అప్పటికే ఎయిర్ పోర్టును మూసివేశారు. దీనితో వారు ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. చిక్కుకున్న వారిలో నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు.

వీరంతా ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే. వీరిని రప్పించడానికి కేంద్ర విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్‌ దేశంలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌ అలెర్ట్‌ అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థులకు తగు సహాయం అందించనున్నారు.

న్యూఢిల్లీతో పాటు తెలంగాణ సెక్రెటేరియట్ లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.  ఇది ఇలా ఉండగా.. 15 మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్నారు. ఉక్రెయిన్ లో తాజా పరిణామాలతో ఆందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు తల్లిదండ్రులు.