పంజాబ్ అభివృద్ధికి పది సూత్రాలు..ఎన్నికలకు ముందు కేజ్రీవాల్​ హామీల జల్లు

Ten principles for the development of Punjab .. Kejriwal's shower of assurances before elections

0
123

మరికొద్ది రోజుల్లో పంజాబ్​ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు. సీఎం పీఠం దక్కించుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) అదే తరహాలో నడుస్తోంది. 10 సూత్రాలతో ‘పంజాబ్​ మోడల్​’ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు ఆప్​ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

“ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 10 సూత్రాలతో ‘పంజాబ్ మోడల్’ను సిద్ధం చేశాం. సంపన్నమైన పంజాబ్‌గా తీర్చిదిద్దుతాం. ఫలితంగా ఉపాధి కోసం కెనడా వెళ్లిన యువత తిరిగి ఇక్కడకే వచ్చి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.”

పంజాబ్​ ప్రజలకు కేజ్రీవాల్​ హామీల జల్లు..

భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

300 యూనిట్లు వరకు 24/7 ఉచితంగా విద్యుత్​ అందిస్తాం.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రిస్తాం.

రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొల్పుతాం.

మతవిద్వేషాల కేసుల్లో బాధితులకు న్యాయం.. నిందితులను కఠినంగా శిక్షించడం.

అవినీతి రహిత రాష్ట్రం తీర్చిదిద్దుతాం.

16,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఉచితంగా వైద్యం అందిస్తాం.

విద్య, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం.

18 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.1000 ఇస్తాం.

రైతుల సమస్యలను పరిష్కరిస్తాం.