టెన్త్‌లో ఫెయిలైన విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

0
105

ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను చేయగా..తాజాగా పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 6 లక్షల 15 వేల 908 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 67.26 శాతంతో 4 లక్షల 14 వేల 281 మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.

దాదాపు 33 శాతం మందికిపైగా పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో దీనిపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు నుంచి మినహాయింపు కల్పించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నెల రోజుల్లోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

అంతేకాకుండా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపారు. అందరికీ హాల్‌ టికెట్లు కూడా అందిస్తామని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానంద రెడ్డి వెల్లడించారు. సప్లిమెంటరీలో పాసైన వారిని కూడా రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారితో సమానంగా గుర్తించనున్నట్లు తెలిపింది.