తిరుపతి ఉపఎన్నికల్లో కొత్త అభ్యర్థిని భరిలోకి దింపుతున్న సీఎం జగన్…ఎవరంటే

తిరుపతి ఉపఎన్నికల్లో కొత్త అభ్యర్థిని భరిలోకి దింపుతున్న సీఎం జగన్...ఎవరంటే

0
95

ఇటీవలే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దుర్గా ప్రసాద్ రావు అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి… ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఆయన పార్టీ తరపున పనబాక లక్ష్మీ పేరుని ప్రకటించారు…

ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు కూడా పోల్ కానీ బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు మళ్లీ పోటీకి సై అంటున్నారు… ఇప్పటి వరకు అధికారికంగా టీడీపీ మాత్రమే తమ అభ్యర్థిని ప్రకటించింది… ఇంతవరకు ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు…

తాజా విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం జగన్ ఫిజియోతెరఫీ డాక్టర్ గురు మూర్తి పేరు ఖరారు చేసినట్లు వార్తల వాస్తున్నాయి… ఇక కాంగ్రెస్ పార్టీ రంగంలో ఉంటుందా లేదా అన్నది ఇంతవరకు ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇవ్వలేదు… ఇక బీజేపీ, జనసేన పార్టీలు దోస్తీ కట్టాయి కాబట్టి పోటీ తప్పని సరిగా ఉంటుంది… చూడాలి మరి ఈ ఉప పోరులో ఎవరు నెగ్గుతారో…