తనకు ఎంతో బాధగా ఉంటుందంటున్న లోకేశ్..

తనకు ఎంతో బాధగా ఉంటుందంటున్న లోకేశ్..

0
77

తుళ్లూరు, మందడం గ్రామాల్లో రైతుల దీక్షకు మాజీ మంత్రి నారాలోకేశ్ సంఘీభావం తెలిపారు…. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… మండుటెండలో రైతులు పడుతున్న కష్టాలు చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందని అన్నారు…. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలకు 11 మంది రైతులు బలైపోయారని లోకేశ్ మండిపడ్డారు. రైతుల పోరాట స్పూర్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హెచ్చరించారు…

ఇంత జరుగుతున్నా రైతులు పండించిన అన్నం తింటూ వైసీపీ నేతలు రైతులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. అధికార మదంతో వైసీపీ నేతలు రైతులను అవమానపరుస్తున్నారని ఆరోపించారు

కష్టాల్లో ఉన్న రైతులు చేస్తున్న పోరాటానికి తనవంతుగా ఆశ్రిత తన చెవి పోగులు ఇచ్చిందని తెలిపారు. ఎంతో మంది తమకి తోచిన విధంగా సహాయం చేసారని వారందరికీ ధన్యవాదాలని లోకేశ్ అన్నారు…