తాను రెడీగా ఉన్నానంటున్న మాజీ మంత్రి గంటా….

తాను రెడీగా ఉన్నానంటున్న మాజీ మంత్రి గంటా....

0
97

టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ ను తెల్లవారు జామున సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన్ను గంటా పలుకరించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు… అక్కడ అయన్ను పోలీసులు అనుమతించలేదు… దీంతో గంటా సీఐడీ అధికారులపై ఫైర్ అయ్యారు…

ఇది సరైన పద్దతి కాదని అన్నారు… కక్ష తీర్చుకోవాలంటే తనపైన తీర్చుకోవాలని అన్నారు.. అంతేకాదని తన సన్నిహితులను ఇబ్బందిపెట్టడం ఏంటని ప్రశ్నించారు… తాను దైనికైనా సిద్దమే అని అన్నారు… ప్రతిపక్ష పార్టీ నేతలను కేసులతో ఇబ్బంది పెట్టడం దారుణం అని అన్నారు..

తనను టార్గెట్ చేయాలని అన్నారు… కాగా మంత్రి అవంతి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు నలంద కిషోర్ కు మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే… తాజాగా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…