పూరీ ఊరిపేరు చెప్పగానే జగన్నాథుడి ఆలయం గుర్తు వస్తుంది. తాజాగా పూరీ నగరం ఓ అరుదైన ఘనతను సాధించింది.లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో 24 గంటలు మంచి నీటి సరఫరా వస్తుంది. అలాగే ఇక్కడ పూరీ నగరం కూడా 24 గంటలు మంచినీటిని (తాగునీరు ) అందించే నగరంగా పేరు సంపాదించుకుంది.
సుజల్ పేరిట డ్రింక్ ఫ్రం ట్యాప్ మిషన్ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది. స్టేట్ లోని పూరి నగరంలో ఎలాంటి వడపోత అవసరం లేకుండా మంచి నీటిని నేరుగా పైప్ లైన్ ద్వారా అందిస్తారు.డ్రింక్ ఫ్రం ట్యాప్ మిషన్ పథకాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.
ఈ విధానంతో పూరి నగరంలోని రెండున్నర లక్షల మంది ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. ఇది విని ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు. ఇక ప్రజలు ప్రత్యేకంచి వాటర్ బాటిల్స్ తీసుకువెళ్లక్కర్లేదు. టూరిస్టులు కూడా తాగునీరు ఇది తాగవచ్చు అంటున్నారు అధికారులు.