అందుకే జనవాణి..ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన పవన్‌ కల్యాణ్‌

0
111

ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని, అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

పవన్ కల్యాణ్ ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు భీమవరంలో నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. అక్కడికి వస్తుండటంతో పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలకనునున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన తర్వాత సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు.