ఈ స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు.. ఏకంగా ఓ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ప్రేమించారు… అందమైన అమ్మాయి కదా అందుకే అంత మంది ప్రేమించి ఉంటారు అని మీరు అనుకోవచ్చు… అయితే ఇక్కడ అబ్బాయిలు నలుగురిని ఆమె కూడా ప్రేమించింది.. ఇది ఇక్కడ ట్విస్ట్… ఏకంగా తల్లిదండ్రులు గ్రామస్తులు ఏం చేశారో తెలుసా.
ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లా ఈ విచిత్ర చరుర్ముఖ ప్రేమాయణం జరిగింది.. అజీమ్ నగర్ పరిధిలోని ఓ గ్రామంలో నలుగురు అబ్బాయిలు తాండా లో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఇక అందరికి ప్రేమ పంచాలి అని ఆమె కూడా నలుగురిని ప్రేమించింది …చివరకు ఆమె నాదంటే నాదని అందరూ కొట్టుకున్నారు, చివరకు ఆమెని నలుగురు కలిసి కిడ్నాప్ చేశారు.
ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి ఆమెని ఆ నలుగురు యువకులని గ్రామంలోకి తీసుకువచ్చారు.. ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తాం ఎవరో సెలక్ట్ చేసుకోండి అంటే, నలుగురు ఆమెని తమదంటే తమది అని అన్నారు. చివరకు రెండు రోజుల తర్వాత నలుగురి పేర్లు చీటిలో రాస్తాం.. ఎవరికి వస్తే వారు చేసుకోవాలి అని తీర్పు చెప్పారు పెద్దలు.. అందరూ ఒకే చెప్పి చీటీలు వేశారు… ఓ వ్యక్తి పేరు వచ్చింది… అతను వివాహం చేసుకున్నాడు.. చివరకు ముగ్గురు పాపం కన్నీరు పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.