ఏపీ ప్రభుత్వం శుభవార్త..ఏకంగా రూ.13,105 కోట్లతో ఇళ్ల నిర్మాణం

0
84

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం అదిరిపోయే శుభవార్త శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. జగనన్న కాలనీల్లో పెద్దగా ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం గృహ నిర్మాణ శాఖపై జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణం కోసం రూ.13,105 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ  గత ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం కేవలం రూ.3600 కోట్లు ఖర్చు చేసినట్టు స్పష్టం చేసింది. త్వరగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలనీ అధికారులకు తెలిపారు.

ఈ ఏడాది ఇళ్లను పకడ్బందీగా కట్టాలనే ఉద్దేశ్యంతో..35 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌, 3.46 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ ను వినియోగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అందుకే ఈసారి రూ.13,105 కోట్లు భారీ ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.