కేంద్రం మరో కీలక నిర్ణయం..సోమవారం రోజే ఆ బిల్లు..

The Center will take another crucial decision on Monday.

0
81

రైతుల ఆందోళనతో కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతులు మాత్రం తమ ఆందోళనలను ఆపేదే లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ‘కొంతమంది’ రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారని.. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఈ నెల 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న రోజునే సాగు చట్టాలను ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించడం వల్ల ఆరోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.