ఇక వాహనాలు నడిపే వారు దేశంలో వస్తున్న కొత్త రూల్స్ అన్నీ తెలుసుకోవాల్సిందే.. ఇప్పటికే దేశంలో ఫాస్టాగ్ అమలులో కి వచ్చింది.. అలాగే కచ్చితంగా బండిపై ఇద్దరూ హెల్మెట్ ధరించాలి అనే నిబంధన వచ్చేసింది… ఇక తాజాగా కారుల్లో అయితే మరో కొత్త రూల్ తీసుకువచ్చారు.. దేశంలో తయారయ్యే అన్ని రకాల కార్లలో ఆగస్టు 31వ తేదీ నుంచి డ్రైవర్ సహ-ప్రయాణికుడి సీట్కు ఎయిర్బ్యాగ్ అమర్చడం తప్పనిసరి అని కేంద్రం తాజాగా ప్రకటించింది.
ఇక వచ్చేనెల నుంచి కొత్త కార్లు అన్నింటికి ఎయిర్ బ్యాగులు కచ్చితంగా డ్రైవర్ పక్క సీట్లో కూడా ఉండాల్సిందే..
ఇప్పటికే రోడ్డుపై తిరుగుతున్న వాహనాల్లో ఆగస్టు 31లోగా ఫ్రంట్ రెండు సీట్లకు ఎయిర్బ్యాగ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
దీనిని అన్నీ కంపెనీలు పాటించాల్సిందే అని తెలిపింది కేంద్రం.
ఇక కచ్చితంగా కో డ్రైవర్ సీటుకి ఎయిర్ బ్యాగ్ అనేది తప్పనిసరి చేశారు, అంతేకాకుండా రివర్స్ పార్కింగ్ అలర్ట్ సిస్టం, అలాగే స్పీడ్ అలర్ట్ సిస్టం ఇవన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు.. ఇక ఎంట్రీ లెవల్ కార్ల నుంచి అన్నీ కార్లు కచ్చితంగా ఇలాగే రానున్నాయి.. కంపెనీలు దీనికి అనుగుణంగా సిద్దం అవుతున్నాయి…
|
|
|
ఆగస్టు 31వ తేదీనుంచి ప్రతీ కారులో ఇవి ఉండాల్సిందే కేంద్రం కొత్త రూల్స్
-