వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..మరింత తగ్గనున్న వంట నూనె ధరలు..

0
66

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశీయ రిటైల్ మార్కెట్లలో వంట నూనె రేట్లు తగ్గించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 17.5% నుంచి 12.5%కి తగ్గించింది.

సోమవారం అర్థరాత్రి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) “శుద్ధి చేసిన పామాయిల్‌పై మార్చి 31, 2022 వరకు 17.5% నుండి 12.5%కి తగ్గించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేటు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

సోమవారం సగటు రిటైల్‌లో వేరుసెనగ నూనె కిలో రూ.181.48, ఆవాల నూనె రూ.187.43, వనస్పతి రూ.138.5, సోయాబీన్‌ ఆయిల్‌ రూ.150.78, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.163.18గా ఉన్నాయి. పామాయిల్‌ ధర కిలోకు రూ. 129గా ఉంది. సుంకం తగ్గింపుతో మరింత దగ్గే అవకాశం ఉంది. వంటనూనె ధరల తగ్గిపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రైతులకు చేయూతనిచ్చేలా రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.